ఆదోని పట్టణంలోని కొత్త ఓవర్ బ్రిడ్జి పైనుంచి కింద పడి సయ్యద్ నూర్ (60) మృతి చెందాడు. సోమవారం బ్రిడ్జి సైడ్ వాల్ పై కూర్చొని ఉన్న ఆయన, ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సయ్యద్ నూర్ కు భార్య సయ్యద్ గౌసియా, ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.