ఆదోని: అసెంబ్లీలో వాల్మీకి రిజర్వేషన్‌పై ఎమ్మెల్యే పార్థసారథి గళం

69చూసినవారు
ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే ఉత్తుత్తి తీర్మానాలు పాస్ చేయడం అన్యాయం అని అసెంబ్లీలో ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి విమర్శించారు. వాల్మీకి (బోయ) సామాజిక వర్గం గత 60 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని, తక్షణమే రిజర్వేషన్ హామీ అమలుకు చర్యలు తీసుకోవాలని బుధవారం డిమాండ్ చేశారు. రాయలసీమలో వాల్మీకి రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేయాలని ఆయన సభను కోరారు.

సంబంధిత పోస్ట్