పీ4 విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆదోనిలో మాట్లాడుతూ పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనతో పాటు పేద కుటుంబాలకు సాధికారత అందించాలన్నదే లక్ష్యమన్నారు. సంపన్న వర్గాలు నిరుపేద కుటుంబాలను దత్తతతో ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. పేద కుటుంబాలను దత్తత తీసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు.