ఆదోని పురపాలక సంఘం చైర్ పర్సన్ లోకేశ్వరి ఆధ్వర్యంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీ మార్కెట్‌ను 9.5 నెలల పాటు రూ.61.80 లక్షలకు గుత్తేదారుడు మహేష్ బాబుకు ఇవ్వాలని కౌన్సిల్ ఆమోదించింది. సమావేశంలో 16వ వార్డులో ఆశ్రమం తొలగింపు పనులు ఇంకా పూర్తి కాలేదని, కాజీపురలో 9 రోజులుగా తాగునీటి సమస్య ఉందని సభ్యులు లేవనెత్తారు.