అదోని నియోజకవర్గంలోని పాండవగల్ గ్రామంలో బుధవారం జరుగుతున్న మూడు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే డీసీపీవో శారద, ఐసీడీఎస్ అధికారులు పోలీసులు అడ్డుకొని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయికి 18ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.