ఆదోని పట్టణంలోని రణ మండల, సింగరాజుమల్ల కొండల, తాయమ్మ బైలులో, సముద్రపు కుంట ప్రాంతాల్లో గురువారం వన్ టౌన్ సీఐ శ్రీరాం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలపై ఒకటో పట్టణ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 6 వేల లీటర్ల బెల్లం ఊట, 80 లీటర్ల నాటు సారాని ధ్వంసం చేశారు. వాల్మీకి నగర్‌కు చెందిన 9 మందిని అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీరాం తెలిపారు.