ఆదోని పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాలను తక్షణమే నిర్మించి, తరగతులు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కోరారు. మంగళవారం ఆదోనిలో ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదోనిలో అర్థాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాలను పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.