ఆదోని: ప్రజాసమస్యలు త్వరితగతిన పరిష్కరించండి: సబ్ కలెక్టర్

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆయా శాఖల అధికారులు త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి శ్రీనివాసరాజు, వేణు సూర్య, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.