ఆదోని: గ్రామీణ విద్యార్థులకు బస్సు సౌకర్యంపై కల్పించాలి

61చూసినవారు
ఆదోని: గ్రామీణ విద్యార్థులకు బస్సు సౌకర్యంపై కల్పించాలి
జూన్ 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్నందున గ్రామాల నుండి వచ్చే నిరుపేద విద్యార్థులకు సమయానికి విద్యార్థి బస్సు సేవలు అందించాలని సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు. ఆదోని డివిజన్‌లో వందల మంది పేద విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారని, వారికి బస్సు సౌకర్యం అవసరమని జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు శశిధర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్