ఆదోని: సీజనల్ హాస్టళ్లు తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

52చూసినవారు
ఆదోని: సీజనల్ హాస్టళ్లు తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన పెద్దహరివాణం గ్రామంలో ఉన్న సీజనల్ హాస్టళ్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల పరిస్థితిని తెలుసుకున్నారు. హాజరు పట్టిక ప్రకారం విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్