జనవరి 5న జరగనున్న రేషన్ డీలర్ల పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సందర్శించి, ఏర్పాట్లపై ఆరా తీశారు. 78 పోస్టులకు 512 మంది దరఖాస్తు చేసుకోగా, 467 మందికి హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఉదయం 10: 00 నుంచి 11: 30 వరకు నిర్వహించే పరీక్షకు, అభ్యర్థులు 9: 30 కేంద్రానికి రావాలన్నారు.