ఆదోని మున్సిపల్ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2025ను పురస్కరించుకుని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సోమవారం అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా, ఫారాలు 6, 7, 8ల పరిణామాలపై చర్చించారు. సమావేశంలో ఆదోని తహసీల్దార్ శివరాముడు, ఎన్నికల డీటీ గాయత్రి తదితర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.