తొలి ఏకాదశి సందర్భంగా ఆదోని పట్టణంలోని ఆలయాలు ఆదివారం భక్తులతో నిండిపోయాయి. విక్టోరియా పేటలోని రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో దర్శనానికి భక్తులు కిలోమీటర్ల పాటు బారులుతీరి నిలబడ్డారు. పట్టణ శివారులోని నల్లకొండ గుహలోని పాండురంగ స్వామి ఆలయం, కార్వాన్ పేటలో శ్రీకృష్ణ ఆలయం, రామాలయం, చిన్మయి మిషన్‌లలో పూజలు ఘనంగా జరిగాయి.