మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుధేంద్రతీర్థులు బుధవారం ఆదోని పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల పునరుద్ధరించబడిన దత్తాత్రేయ ఆలయంలో కుంభాభిషేకం, ప్రతిష్ఠాపన మహోత్సవంలో స్వయంగా పాల్గొని, నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శ్రీమఠానికి చెందిన భక్తులు, శిష్యులు స్వామీజీకి తులాభార సేవ చేసి గురువందనాలు అందజేశారు. శ్రీమంగరాయ ఆలయంలో ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారు.