రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ఆదోని నుండే ప్రారంభమైందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ బోయ శాంతపై అవిశ్వాస తీర్మానం అనంతరం కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే పార్థసారథిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి విజయాలు రాష్ట్రామంతా వస్తాయన్నారు.