ఆదోని: వీధి వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు

52చూసినవారు
ఆదోని: వీధి వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు
ఆదోని మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు స్మార్ట్ స్ట్రీట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా, ఈనెల 19వ తేదీలోగా, వ్యాపారులు తమ ప్రాంతంలోని సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్