ఆదోని మండలంలోని పెద్దతుంబలం, కడితోట గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి కూలీలతో చర్చించారు. పనులను కొలతల ప్రకారం చేపట్టాలని, కూలీల హాజరులను సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే పనులు ప్రజలకు, రైతులకు ఉపయోగకరంగా ఉండాలని, పనుల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.