ఆదోని అమరావతి నగర్‌లో రూ.15 లక్షలతో స్వచ్చంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక శౌచాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ వైసీపీ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు. మహిళల శౌచాలయ అవసరాల కోసం ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయన్నారు.