ఆదోని మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. శనివారం ఆదోనిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు.