ఆదోని పట్టణంలో విట్టా రమేష్ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెడుతున్నారని, ఇది పద్దతేనా అంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఆదోనిలో మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి ఒట్టి ఆబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పార్టీ మద్దతుదారులైన చైర్మన్ శాంతపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎమ్మెల్యేకు ఏంటి బాధ అంటూ ప్రశ్నించారు.