సెంట్రింగ్ మేస్త్రీ ఇంట్లో చోరీ
By W. Abdul 71చూసినవారుఆదోని పట్టణం కల్లుబావిలో సెంట్రింగ్ మేస్త్రీ రామాంజనేయులు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడినట్లు మంగళవారం పోలీసులు విలేకరులకు తెలిపారు. తాళం పగులగొట్టి 4 తులాల బంగారం, 36 తులాల వెండి, రూ. 15 వేలు నగదు చోరీకి పాల్పడినట్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటిని పరిశీలించారు. ఊర్లకు వెళ్లినప్పుడు పక్కా వారికిగాని, పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.