ఆదోని పట్టణంలోని 22వ వార్డును మున్సిపల్ కమిషనర్ రామచంద్రా రెడ్డి సందర్శించి జరుగుతున్న పారిశుద్ధ పనులను, తాగు నీటి సరఫరాను, వీధి దీపాలను పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తీర్చే విధంగా పురపాలక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.