ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి క్యూరింగ్ చేస్తున్న సమయంలో మోటార్ తాకడంతో బి.మహేశ్ (13) అనే బాలుడు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు.