లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా శుక్రవారం లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. క్లబ్ జిల్లా ఛైర్మన్లు డాక్టర్ గోపీనాథ్, ప్రసాదరావు మాట్లాడుతూ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా కొనసాగి పేదలకు గృహాలు, రవాణా సౌకర్యం, ఆర్థిక సాంకేతిక రంగాలలో విశిష్టమైన సేవలు అందించారని కొనియాడారు.