ఆదోని లయన్స్ క్లబ్ వారిచే స్థానిక రాజరాజేశ్వరి నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 50 మంది బాల బాలికలకు నోటు బుక్కులు, పెన్నులు, మిఠాయిలు పంచిపెట్టారు. దేశ స్వాతంత్రం కోసం మహా వీరుల త్యాగాలు, కృషిని స్మరించుకున్నారు. దేశభక్తిని ప్రతి దేశ పౌరుడు ఇనుమడించుకోవాలని ఆదోని పట్టణం లయన్స్ క్లబ్ కార్యదర్శి వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు.