ఆదోనిలోని ఎన్‌జీఓస్ కాలనీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భాష్యం స్కూలు ఆధ్వర్యంలో గురువారం హార్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్ధి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని చైర్మన్ రామకృష్ణ ఆదేశాల మేరకు సీఈఓ బి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం పోటీలో విజేతలకు సిఐ శ్రీరాములు బహుమతులు అందజేశారు. హెచ్ఎం కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపల్ అంజి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.