కపటి:విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

64చూసినవారు
కపటి:విద్యుత్ షాక్ తో బాలుడు మృతి
ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన సురేంద్ర(14) బుధవారం ఏరువాక పౌర్ణమి రోజున ఎద్దులకు రంగులు వేస్తుండగా రేకుల షెడ్డు యాంగర్ కు తాకి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బైక్ పై ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న సురేంద్ర మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్