ఆదోని మండలంలోని ఇస్వీ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 20 లీటర్ల నాటుసారాను బుధవారం ఇస్వీ ఎస్సై డాక్టర్ నాయక్ దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బాలాజీపేట, ఆదోని పట్టణానికి చెందిన బోయ శివను ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నాటుసారా విక్రయం, తయారీపై నిఘా పెంచినట్లు వారు పేర్కొన్నారు.