ఆదోని రణమండల కొండల్లో నాటుసారా తయారీ స్థావరంపై దాడి చేసి 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సైదుల్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో 270 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వాల్మీకినగర్‌కు చెందిన బోయ కార్తికేయపై కేసు నమోదైందన్నారు. నాటుసారా నిర్మూలనకు చర్యలు కొనసాగుతాయన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలపై నిఘా ఉంటుందని తెలిపారు.