ఆదోనిలోని మేదర గేరీ ఓవర్ బ్రిడ్జి వద్ద గుంతలకు మరమ్మతులు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె అజయ్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోనిలోని ఓవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇనుప రాడ్లు లేచి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆటో, లారీ, ఆర్టీసీ కార్మికులు, ద్విచక్ర వాహనదారులు, హమాలి కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.