ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ సంయుక్తంగా శాంతిరామ్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని శిబిరం దాత ఎన్నారై కాకబాళ్ నగేష్ తెలిపారు. ఆదివారం ఆదోనిలోని శ్రీహరళయ్య స్వామి గుడి నిర్వహించిన శిబిరంలో 318 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తున్నామన్నారు.