కోల్‌కత్తాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆదోనిలోని ప్రయివేట్ ఆసుపత్రుల్లో (అత్యవసర సేవలు తప్ప) వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ఆదోని శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్లు కిరణ్ కుమార్, మధు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఏపి వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని కఠిన తరం చేయాలన్నారు. సిబిఐతో విచారణ జరిపించి నిందితులకు కఠినంగా శిక్షించాలన్నారు.