ఆదోని డీఎస్పీ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ సర్కిల్ వద్ద శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. వాహనదారులు తమ వద్ద తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని సూచించారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.