ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడం జరిగింది. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వర్షం నీరు కాలువలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, రానున్న వర్షాకాలం లో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.