ఆళ్లగడ్డ: కిషోరి వికాసంలో బాలల హక్కులపై అవగాహన

64చూసినవారు
ఆళ్లగడ్డ: కిషోరి వికాసంలో బాలల హక్కులపై అవగాహన
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు అంగన్వాడీ సెంటర్‌లో మంగళవారం జరిగిన కిషోరి వికాసం కార్యక్రమంలో బాలల హక్కులు, రక్షణ, ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రభాకరమ్మ మాట్లాడుతూ, మైనర్ బాలికల రక్షణ కోసం ఫోక్సో చట్టం అమలులో ఉందని, దుర్వినియోగం ఎదురైతే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్