ఆళ్లగడ్డ తాలూకా యాదవ సంఘం అధ్యక్షుడిగా బివి భాస్కర్ యాదవ్‌ను రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చే విధంగా యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తేవడంలో చొరవ చూపుతానని తెలిపారు. నియామకానికి తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.