నల్లగట్ల గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. కడప వైపు వెళ్తున్న కారు, ముందుగా వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నందిని (18) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్లాస్టిక్ వస్తువులు అమ్మే చిరు వ్యాపారులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.