ఆళ్లగడ్డ: స్కూలుకు వెళ్లిన మొదటిరోజే కబలించిన మృత్యువు

17చూసినవారు
ఆళ్లగడ్డ: స్కూలుకు వెళ్లిన మొదటిరోజే కబలించిన మృత్యువు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మొదటి రోజు పాఠశాలకు వెళ్లిన హరిప్రియ(5) తిరిగి ఇంటికొస్తూ ప్రాణాలు కోల్పోయింది. బస్సు దిగిన చిన్నారి ఇంటికెళ్లేందుకు ముందు నుంచి వెళ్లగా, డ్రైవరు అనుకోకుండా అప్పుడే బస్సును నడపడంతో చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. క్లీనర్ లేకపోవడం, పాఠశాల నిర్లక్ష్యమే కారణమని బంధువులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్