ఆళ్లగడ్డ మండలం బాచేపల్లిగ్రామంలో శ్రీ కృష్ణ దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, స్వాతి వైద్యశాల ఆధ్వర్యంలో ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ సౌజన్యంతో స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. కంటి వైద్య సమస్యలు ఉన్నవారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి అద్దాలను కూడా ఇస్తామని వైద్యులు తెలిపారు.