ఆళ్లగడ్డ పాత బస్టాండ్ వద్ద మున్సిపాలిటీ నీటి ట్యాంకులు నిండిపోయి, విద్యుత్ కోత వల్ల పై ట్యాంకులకు నీరు పంపించలేకపోతున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వేల లీటర్ల మంచినీటిని వదిలేయాల్సి వస్తోంది. గండ్లేరు రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా వచ్చే నీరు ట్యాంకుల్లో నిల్వ చేయాల్సి ఉన్నా, విద్యుత్ లేక నీటి పంపకానికి అంతరాయం ఏర్పడిందని సమాచారం