చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి సీఎం అయితే మోకాళ్లపై తిరుమలకు వస్తానని ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి చెందిన తెదేపా నేత గౌరు వెంకటరామిరెడ్డి కోరుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మోకాళ్లపై మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఓబులంపల్లి, ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.