మాలల యుద్ధ గర్జన విజయవంతం చేద్దామని ఆళ్లగడ్డ నియోజకవర్గం మాల మహానాడు జేఏసీ సభ్యులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన సమావేశంలో జెఎసి సభ్యులు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 23 కర్నూల్ లో జరిగే భారీ మాలల యుద్ధ గర్జన సభను విజయవంతం చేద్దామని అందుకు మాలలు అందరూ దండయాత్రగా కదలి రావాలని వారు అన్నారు. కడియం సాంబశివుడు పరదేశి రోజు అక్క సాత్రి రాజు తదితరులు పాల్గొన్నారు.