ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ తాలూకా పరిధిలో మొత్తం 120 గోకులం షెడ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 30 గోకులం షెడ్లు పూర్తయ్యాయని అన్నారు. ఇందుకు సుమారు రూ.2.76కోట్లు నిధులు మంజూరైనట్లు వివరించారు.