ప్లాస్టిక్ వస్తువుల విక్రయానికి ఆళ్లగడ్డకు వస్తుండగా శుక్రవారం నల్లగట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందిన వారు మూడు బైక్‌లపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నందిని (18) మృతి చెందగా, ఇతర గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.