ఆళ్లగడ్డ భూమా శోభ ఘాట్లో స్వర్గీయ భూమా నాగిరెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు. భూమా నాగిరెడ్డిని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు దేవుడిగా కొలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.