ఆళ్లగడ్డ మండలంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో బుధవారం తెల్లవారుజామున దుండగులు సుబ్రహ్మణ్య స్వామి పుట్టకు అలంకరించిన సుమారు 20 కేజీల వెండి తొడుగులు, నాగాభరణాన్ని చోరీ చేశారు. ఈ ఘటనపై ఆలయ ఈవో జయ చంద్ర రెడ్డి ఫిర్యాదు చేయగా, రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఆలయానికి వచ్చి సిబ్బందితో కలిసి పరిశీలించారు.