చాగలమర్రి మండల టీడీపీ కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి పై శుక్రవారం చిన్న వంగలి గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలలో ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు దురుసుగా ప్రవర్తించి, కాలర్ పట్టుకొని చేయి చేసుకున్నందుకు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆళ్లగడ్డ తాలూకా టిడిపి నాయకులు ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలి నుండి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.