కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం పనితీరు బేస్ గా ఉందని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పట్టణంలోని జిపిఆర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని ప్రధానంగా ఆదాయపు పన్ను రూ.12 లక్షల వరకు సడలింపు చేయడం శుభసూచకమని ఆయన అన్నారు.