ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ స్థానిక పోలీస్ స్టేషన్ నందు గురువారం రోజున పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు విలువైన బంగారు నగలను, డబ్బు ఇంటిలో కాకుండా బ్యాంకులో భద్రపరచాలని విహారయాత్రలకు వెళ్లేవారు దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారి వివరాలను పోలీసు వారికి తెలియజేస్తే ఆ ప్రాంతంలో నిఘా పెట్టడం జరుగుతుందని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు.