చాగలమర్రి మండలంలోని గొడిగనూరు, డి.వనిపెంట గ్రామాలలో పంట సాగు హక్కు పత్రాల గురించి కౌలు రైతులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రంగ నేతాజి మాట్లాడుతూ కౌలు కార్దులు యొక్క ప్రాముఖ్యత వాటి ఉపయోగాలు కౌలు కార్దులు పొందడంవలన వచ్చు పథకాల గురించి వివరించారు. కౌలుకార్డుల వలన బ్యాంకు రుణం కూడా పొందవచ్చునని దీని వలన భూయజమానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.